భారత ఆర్మీకి కొత్త యూనిఫామ్ వచ్చేస్తోంది

Indian Army To Get New Combat Uniform With Digital Disruptive Pattern In 2022. భారత ఆర్మీకి కొత్త యూనిఫామ్‌ను అందజేయనున్నట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు.

By Medi Samrat  Published on  3 Dec 2021 2:11 PM GMT
భారత ఆర్మీకి కొత్త యూనిఫామ్ వచ్చేస్తోంది

భారత ఆర్మీకి కొత్త యూనిఫామ్‌ను అందజేయనున్నట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి కొత్త యూనిఫాంను అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. వేసవి, చలికాలాల్లో మరింత సౌకర్యవంతంగా ఉండేలా దీనిని తయారుచేశారు. మంచు, అటవీ ప్రాంతాల పరిసరాల రంగుల్లో కలిసిపోయేలా ఉండే రంగులను యూనిఫామ్‌ కోసం ఎంపికచేశారు. 'డిజిటల్‌ డిస్ట్రర్బ్‌' డిజైన్‌లో ఈ యూనిఫామ్‌ను రూపొందించారు.

కొత్త యూనిఫాం రంగు ప్రకృతిలో సులభంగా కలిసిపోయే విధంగా.. ముఖ్యంగా శత్రువులు గుర్తించలేని విధంగా ఈ యూనిఫామ్​ ఉండనుంది. ఇప్పుడున్న యూనిఫాంతో పోలిస్తే బరువు తక్కువగా ఉంటుందని వెల్లడించాయి. వచ్చే ఏడాది జనవరి 15న జరిగే ఆర్మీ డే పరేడ్‌లో తొలిసారిగా అధికారికంగా దీనిని ప్రదర్శించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల సైనికులకు యుద్ధక్షేత్రాల్లో వినియోగిస్తున్న వేర్వేరు డిజైన్‌ల ఆర్మీ యూనిఫామ్‌లను పరిశీలించి, పలు చర్చల అనంతరం ఈ యూనిఫామ్‌కు భారత ప్రభుత్వం ఓకె చెప్పింది. కొత్త కాంబాట్ యూనిఫాం తేలికైన కానీ ధృడమైన పదార్థంతో తయారు చేయబడుతుందని రక్షణ వర్గాలు తెలిపాయి.


Next Story