ఇకపై ఉగ్రదాడులు జరిగితే భారత్ ఇలాగే స్పందిస్తుంది

భవిష్యత్తులో జరిగే ఏవైనా ఉగ్రవాద దాడులను యుద్ధ చర్యలుగా పరిగణించాలని భారత్ నిర్ణయించిందని, దానికి అనుగుణంగా ప్రతిస్పందిస్తుందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి.

By Medi Samrat
Published on : 10 May 2025 6:40 PM IST

ఇకపై ఉగ్రదాడులు జరిగితే భారత్ ఇలాగే స్పందిస్తుంది

భవిష్యత్తులో జరిగే ఏవైనా ఉగ్రవాద దాడులను యుద్ధ చర్యలుగా పరిగణించాలని భారత్ నిర్ణయించిందని, దానికి అనుగుణంగా ప్రతిస్పందిస్తుందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తరువాత, మే 7న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె)లోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లపై భారత దళాలు ఖచ్చితమైన దాడులు నిర్వహించాయి. ఆ తరువాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి.

ఇక కాల్పుల విరమణకు సంబంధించి పాకిస్తాన్ భారతదేశాన్ని సంప్రదించింది. కాల్పుల విరమణ గురించి రెండు దేశాల మధ్య నేరుగా చర్చలు జరిగాయని భారత ప్రభుత్వం శనివారం తెలిపింది. కాల్పుల విరమణను భారత్ ధృవీకరించింది.

Next Story