జూన్ 4న దేశం మళ్లీ హోలీని జరుపుకుంటుంది : జేపీ నడ్డా
భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు జేపీ నడ్డా హోలీ సందర్భంగా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
By Medi Samrat Published on 25 March 2024 8:09 PM ISTభారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు జేపీ నడ్డా హోలీ సందర్భంగా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జూన్ 4 న దేశం మళ్లీ హోలీని జరుపుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ రోజున లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడి, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుంది. 'అభివృద్ధి చెందిన భారతదేశం' అనే సంకల్పంతో ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం మరోసారి హోలీని జరుపుకుంటుందన్నారు.
దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. దేశ ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని జీపీ నడ్డా అన్నారు. ఈ హోలీ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని, శాంతిని తీసుకురావాలని కోరుకుంటున్నాను. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ముందుకు సాగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. జూన్ 4న ప్రధాని మోదీ నాయకత్వంలో, వికసిత్ భారత్ అనే సంకల్పంతో దేశం మళ్లీ హోలీని జరుపుకుంటుంది.
దేశ రాజధానిలోని తన నివాసంలో నడ్డా హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, బీజేపీ నేత బన్సూరి స్వరాజ్‌తో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. మీ అందరికీ పవిత్ర పండుగ హోలీ శుభాకాంక్షలు అని జేపీ నడ్డా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పవిత్ర రంగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో పరస్పర ప్రేమ, సామరస్యం, సద్భావన నింపాలని కోరుకుంటున్నాను.