కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒడిశాలోని కటక్ జిల్లా ముందలిలో జరిగిన సీఐఎస్ఎఫ్ (CISF) 57వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. మార్చి 31 నాటికి భారతదేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నుండి నేపాల్‌లోని పశుపతినాథ్ వరకు 'రెడ్ కారిడార్' నిర్మించాలని కలలు కనే శక్తులను మన భద్రతా దళాలు ఖచ్చితంగా ఓడిస్తాయని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో నక్సలిజం అంతం కావడమే లక్ష్యమని, దేశ ఆర్థిక వృద్ధిలో సీఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన కొనియాడారు. అంతర్గత భద్రత పటిష్టంగా ఉండటం వల్లే దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని అమిత్ షా పేర్కొన్నారు.