ఆగస్ట్ నుంచి మనదేశంలో స్పుత్నిక్-వి ఉత్పత్తి
India to produce 850 million doses of Sputnik V vaccine. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ఉత్పత్తిని భారతదేశంలో ప్రారంభించడానికి రష్యా ప్రణాళికలు
By Medi Samrat Published on 22 May 2021 11:06 AM GMTరష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ఉత్పత్తిని భారతదేశంలో ప్రారంభించడానికి రష్యా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ వాక్సిన్ ను మన దేశంలో మూడు దశలలో ఉత్పత్తి చేయనున్నట్లు రష్యా భారత రాయబారి డీబీ వెంకటేష్ వర్మ రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. మొదటి దశలో రష్యా నుంచి వాక్సిన్ సరఫరా అవుతుంది.
రెండో దశలో ఆర్‌డీఐఎఫ్ రూపంలో డోసులను పంపిస్తారు. ఇవి కూడా నేరుగా వినియోగించుకోవచ్చు అయితే దీన్ని మనదేశం లో బాటిళ్లలో నింపాల్సి ఉంటుంది. ఇక మూడోది.. రష్యా కంపెనీ భారత కంపెనీకి టీకా టెక్నాలజీని పంపిస్తుంది. అప్పుడు భారత కంపెనీ ఇక్కడే పూర్తిగా టీకాల ఉత్పత్తి ప్రారంభిస్తుంది'' అని వెంకటేశ్ వర్మ వెల్లడించారు.
ఆగస్ట్ నెల నుంచి స్పుత్నిక్ వి భారత్ లో ఉత్పత్తిని ప్రారంభిస్తుందని, 850 మిలియన్ డోసుల వ్యాక్సిన్ భారత దేశం నుంచి ఉత్పత్తి చేయడానికి కంపెనీ సిద్దం అవుతోందన్నారు. ప్రపంచం మొత్తం ఉత్పత్తి అయ్యే స్పుత్నిక్ వి టీకాలలో 65-70% భారతదేశంలో తయారవుతుందని రష్యాలో భారత రాయబారి చెప్పారు. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితిపై స్పందించిన ఆయన రష్యా ఇప్పటికే ఒకసారి 1,50,000 మరోసారి 60,000 చెప్పున డోసులను భారత్‌కు సరఫరా చేసామన్నారు.
రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సహకారంతో గమలేయా ఇన్‌స్టిట్యూట్ ఈ టీకాను అభివృద్ధి చేసింది. భారత్‌లో ఈ వ్యాక్సిన్‌ను తయారీ, పంపిణీ చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలోనే స్పుత్నిక్ వి అత్యవసర వినియోగానికి డాక్టర్ రెడ్డీస్ కు కేంద్రం ఆమోదం తెలుపడంతో ఈ టీకా మనకి అందుబాటులోకి వచ్చింది.
For Sputnik, 150,000 doses plus 60,000 doses supplied to India. By May-end about 3 mn doses will be supplied in bulk. Those will be filled in India. In June, it's expected to increase to 5 mn & production in India expected to start in Aug: Indian Envoy to Russia, in St Petersburg pic.twitter.com/mCWaGG95z8
— ANI (@ANI) May 22, 2021