వివో.. దేశీయంగా తయారు చేసిన స్మార్ట్‌ ఫోన్‌లను విదేశాలకు తరలించే ప్రయత‍్నం..!

India Stops Export Of 27,000 Vivo Phones Worth $15 Million. చైనా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ వివో దేశీయంగా తయారు చేసిన స్మార్ట్‌ ఫోన్‌లను విదేశాలకు తరలించే ప్రయత‍్నం చేస్తుండగా

By M.S.R  Published on  7 Dec 2022 2:30 PM GMT
వివో.. దేశీయంగా తయారు చేసిన స్మార్ట్‌ ఫోన్‌లను విదేశాలకు తరలించే ప్రయత‍్నం..!

చైనా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ వివో దేశీయంగా తయారు చేసిన స్మార్ట్‌ ఫోన్‌లను విదేశాలకు తరలించే ప్రయత‍్నం చేస్తుండగా కేంద్ర అధికారులు అడ్డుకున్నారు. భారతదేశం నుండి పరికరాలను రవాణా చేయాలనే చైనా కంపెనీ ప్రణాళికకు ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర అధికారులు దాదాపు 27,000 స్మార్ట్‌ఫోన్‌లను ఎగుమతి చేయకుండా వివోను అడ్డుకున్నారు. వారం రోజుల పాటు శ్రమించి సుమారు 27వేల ఫోన్‌ల రవాణాను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. వివో కమ్యూనికేషన్స్ టెక్నాలజీ సంస్థ భారత్‌లో స్మార్ట్‌ ఫోన్‌లను తయారు చేసి స్థానికంగా విక్రయిస్తుంది. తాజాగా వివో తయారు చేసిన ఆ స్మార్ట్‌ఫోన్‌లను, వాటి విలువను తక్కువగా చూపెట్టి దేశ సరిహద్దులు దాటిస్తున్నారంటూ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన రెవెన్యూ ఇంటెలిజెన్స్ యూనిట్ విభాగానికి సమాచారం అందింది.

సమాచారం అందుకున్న ఇంటెలిజెన్స్‌ పోలీసులు న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఫోన్‌లను సరఫరా చేస్తున్న నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వివోపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మొహింద్రూ డిసెంబర్ 2న ఐటీ శాఖకు చెందిన ఉన్నతాధికారులకు లేఖ రాశారంటూ బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. 2020ల్లో సరిహద్దుల వద్ద భారతదేశం-చైనా మధ్య ఉద్రిక్తతలు ఎక్కువయ్యాయి. దీంతో భారతదేశంలో పనిచేస్తున్న చైనా కంపెనీలపై కేంద్రం ఓ కన్నేసింది.


Next Story