భారత్‌లో పరిస్థితులపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఆందోళన

India needs to order 1 billion jabs to cover 60% of population. భార‌త్‌లో న‌మోద‌వుతోన్న క‌రోనా కేసులు, మృతుల సంఖ్య ప‌ట్ల అంతర్జాతీయ

By Medi Samrat  Published on  22 May 2021 11:01 AM GMT
భారత్‌లో పరిస్థితులపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఆందోళన

భార‌త్‌లో న‌మోద‌వుతోన్న క‌రోనా కేసులు, మృతుల సంఖ్య ప‌ట్ల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. భార‌త్‌లో నెల‌కొన్న ప‌రిస్థితులు మధ్య ఆదాయ దేశాలన్నింటికీ హెచ్చరిక వంటివని కొత్త నివేదిక రూపొందించింది. ఈ ఏడాది చివరి నాటికి భార‌త్‌లో 35 శాతం మంది జనాభాకు మాత్రమే వ్యాక్సిన్లు అందుతాయని.. తొలి ద‌శ‌ కరోనా విజృంభ‌ణ‌ను భారత్ తట్టుకుందని అన్నారు. భారత్ లో రెండో ద‌శ విజృంభ‌ణ‌లో పరిస్థితులు బాగాలేవని అంటోంది. భార‌త్‌లో రోగుల‌కు ఆక్సిజన్, బెడ్లు, ఔష‌ధాలు, సౌకర్యాలు అంద‌క చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నార‌ని చెప్పింది.

ఆఫ్రికాతో పాటు పలు ప్రాంతాల్లో తీవ్రమైన తొలి ద‌శ‌ ముప్పును తప్పించుకోగలిగిన అల్పాదాయ, మధ్య ఆదాయ దేశాలకు భారత్ లో నెల‌కొన్న పరిస్థితులు ఓ హెచ్చరిక లాంటివ‌ని ఐఎంఎఫ్ తెలిపింది. ఇప్పటివరకు తీవ్ర సమస్య ఎదుర్కోని ఇతర మధ్యాదాయ దేశాలకు హెచ్చరిక వంటిదని ఐఎంఎఫ్ తెలిపింది. చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్, ఎకనమిస్ట్ రుచిర్ అగర్వాల్ ఈ నివేదికను సంయుక్తంగా రూపొందించారు.

2021 చివరినాటికి ఇండియాలో 35 శాతం జనాభాకు మాత్రమే టీకాలు అందుతాయని నివేదిక తెలిపింది. భారత్ లో ఘోరమైన సెకండ్ వేవ్, బ్రెజిల్ లో మరో కరోనా కల్లోలం తలెత్తడం గమనిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మరిత దారుణమైన పరిస్థితులు తలెత్తుతాయని అనిపిస్తున్నట్లు నివేదికలో తెలిపారు. ఆఫ్రికాతోసహా పలు ప్రాంతాల్లో తీవ్రమైన ముప్పును తప్పించుకోగలిగిన అల్పాదాయ, మధ్యాదాయ దేశాలకు భారత్ పరిస్థితి ఓ హెచ్చరిక లాంటిదని ఐఎంఎఫ్ నివేదిక తెలిపింది. ప్రస్తుతం కోవాక్స్ కార్యక్రమం కింద ద్వైపాక్షిక మార్గాల ద్వారా సేకరిస్తున్న టీకాలతో భారత్ 2022 మధ్యనాటికి 25 శాతం జనాభాకు రోగనిరోధకత కల్పించగలదు. కానీ 60 శాతం లక్ష్యం సాధించాలంటే భారత్ తక్షణమే 100 కోట్ల డోసులకు ఆర్డరు చేయాల్సి ఉంటుందని ఐఎంఎఫ్ నివేదిక సూచించింది. ధ‌నిక‌ దేశాల్లో ఇప్ప‌టికే 50 శాతం నుంచి 70 శాతం మ‌ధ్య వ్యాక్సినేష‌న్ పూర్తయింద‌ని తెలిపింది.


Next Story