కోవిడ్-19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. డీజీసీఏ అన్ని అంతర్జాతీయ షెడ్యూల్డ్ వాణిజ్య విమానాలపై నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. అయితే అంతర్జాతీయ కార్గో విమానాలు, ఎయిర్ బబుల్ ఒప్పందాల ప్రకారం నిర్వహించబడతాయి. వివిధ దేశాల్లో కోవిడ్-19 విస్తరిస్తున్న నేపథ్యంలో భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ అన్ని అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాలపై నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. నిషేధం యొక్క పొడిగింపు షెడ్యూల్ చేయబడిన అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల విమానాలకు వర్తిస్తుంది. అంతర్జాతీయ ఆల్-కార్గో కార్యకలాపాలకు, ఎయిర్ బబుల్ ఒప్పందాల ప్రకారం నిర్వహించబడే ప్రత్యేక విమానాలకు ఈ నిషేధం వర్తించదని డీజీసీఏ పేర్కొంది.
26-11-2021 నాటి సర్క్యులర్ యొక్క పాక్షిక సవరణలో.. షెడ్యూల్డ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసింజర్ సర్వీసుల సస్పెన్షన్‌ను 28 ఫిబ్రవరి, 2022 పొడిగించాలని కాంపిటెంట్ అథారిటీ నిర్ణయించింది" అని డీజీసీఏ తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా, భారతదేశంలో షెడ్యూల్ చేయబడిన అంతర్జాతీయ ప్రయాణీకుల సేవలు మార్చి 23, 2020 నుండి నిలిపివేయబడ్డాయి. అయినప్పటికీ ప్రత్యేక అంతర్జాతీయ విమానాలు మే 2020 నుండి వందే భారత్ మిషన్ కింద, ద్వైపాక్షిక "ఎయిర్ బబుల్" ఏర్పాట్ల క్రింద పనిచేస్తున్నాయి. యుఎస్, యుకె, యుఎఇ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్‌తో సహా దాదాపు 32 దేశాలతో భారత్ ఎయిర్ బబుల్ ఒప్పందాలను కుదుర్చుకుంది. రెండు దేశాల మధ్య ఎయిర్ బబుల్ ఒప్పందం ప్రకారం, ప్రత్యేక అంతర్జాతీయ విమానాలను వారి భూభాగాల మధ్య వారి విమానయాన సంస్థలు నడపవచ్చు.