దేశంలో కరోనా కేసుల వివరాలు
India Corona Cases Update. భారత్‌లో కరోనా విజృంభన కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 13,94,573 కరోనా
By Medi Samrat Published on 31 Aug 2021 4:46 AM GMTభారత్‌లో కరోనా విజృంభన కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 13,94,573 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 30,941 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,27,68,880కి చేరింది. నిన్న ఒక్క రోజే 350 మంది మృతి చెందారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,38,560కి చేరింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) August 31, 2021
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/7lVjQGrrvZ pic.twitter.com/qyvm1nlp7A
24 గంటల వ్యవధిలో 36,275 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,19,59,680కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,70,640 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.53శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.51శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.22 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 64,05,28,644 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.