దేశంలో తగ్గిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..

India Corona Cases. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గ‌డిచిన‌ 24గంటల్లో భారత్‌లో

By Medi Samrat  Published on  7 Jun 2021 5:27 AM GMT
దేశంలో తగ్గిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గ‌డిచిన‌ 24గంటల్లో భారత్‌లో 1,00,636 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు దేశంలో 2,89,09,975 మంది కరోనా వైరస్‌ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. ఇక‌ నిన్న ఒక్క‌రోజే 2,427 మంది కోవిడ్‌తో మృతి చెందిన‌ట్లు బులిటెన్‌లో పేర్కొన‌గా.. ఇప్ప‌టివ‌ర‌కూ 3,49,186 మంది కోవిడ్‌ బాధితులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఇక గత 24 గంటల్లో 1,74,399 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 14,01,609 యాక్టివ్ కేసులు ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు 23,27,86,482 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.Next Story
Share it