దేశంలో కొత్త‌గా 30వేల‌కు పైగా క‌రోనా కేసులు

India Corona Cases. దేశంలో గడిచిన 24గంటల్లో కొత్త‌గా 30,254 కొవిడ్‌ కేసులు న‌మోద‌య్యాయ‌ని

By Medi Samrat  Published on  13 Dec 2020 11:03 AM IST
దేశంలో కొత్త‌గా 30వేల‌కు పైగా క‌రోనా కేసులు

దేశంలో గడిచిన 24గంటల్లో కొత్త‌గా 30,254 కొవిడ్‌ కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 98,57,029కు చేరాయి. అయితే కొత్త‌గా మరో 391 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 1,43,019కు పెరిగింది. అలాగే.. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 3,56,546 ఉన్నాయని పేర్కొంది.

ఇక గ‌డిచిన 24 గంటల్లో 33,136 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 93,57,464 మంది డిశ్చార్జి అయినట్లు మంత్రిత్వశాఖ వివరించింది. దేశంలో రికవరీ రేటు 94.93శాతం కాగా.. మరణాల రేటు 1.45శాతంగా ఉందని తెలిపింది. ఇదిలావుంటే.. శనివారం ఒక్క‌రోజే దేశవ్యాప్తంగా 10,14,434 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్(ఇండియన్‌ కౌన్సిలర్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌‌) తెలిపింది. కాగ‌, ఇప్పటి వరకు 15,37,11,833 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.


Next Story