భారీగా కరోనా తగ్గుముఖం.. గతేడాది మే నాటి స్థాయికి కేసులు

India corona bulletin on november 30th. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. తాజాగా 7 వేలకు దిగువన కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇవి గత సంవత్సరం

By అంజి  Published on  30 Nov 2021 10:30 AM IST
భారీగా కరోనా తగ్గుముఖం.. గతేడాది మే నాటి స్థాయికి కేసులు

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. తాజాగా 7 వేలకు దిగువన కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇవి గత సంవత్సరం నాటి స్థాయికి పడిపోయాయి. నిన్న 10,12,523 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 6,990 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. కరోనా వ్యాప్తి అదుపులో ఉండటంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య లక్ష మార్కుకు చేరువగా ఉంది. నిన్న మరో 10,116 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 98.35 శాతం పెరగగా.. క్రియాశీల రేటు 0.29 శాతానికి తగ్గింది. గత సంవత్సరం ప్రారంభం నుండి 3.45 కోట్ల మంది కరోనా బారిన పడగా.. అందులో 3.40 కోట్ల మంది కరోనా వైరస్‌ నుండి కోలుకున్నారు.

కాగా గడిచిన 24 గంటల వ్యవధిలో 190 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మృతుల సంఖ్య 4,68,980కి చేరింది. దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 78,80,545 మంది కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఇప్పటి వరకు 123 కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ అయ్యినట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపులో ఉంది. కానీ ఇప్పుడు ప్రపంచాన్ని కొత్త వేరియంట్‌ ఒమ్రికాన్‌ భయపెడుతోంది. దీని వ్యాప్తి ఏ స్థాయిలో ఉంటుందో అంచనా లేకపోయినప్పటీకి, ఈ వేరియంట్‌ మరో ముప్పుగా మారే ఛాన్స్‌ ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.


Next Story