భారత్‌ కరోనా అప్‌డేట్‌.. 544 రోజుల కనిష్ఠానికి యాక్టివ్‌ కేసులు.!

India corona bulletin on november 29th. దేశంలో కొత్తగా 8,309 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,80,832కు చేరుకుంది.

By అంజి  Published on  29 Nov 2021 5:02 AM GMT
భారత్‌ కరోనా అప్‌డేట్‌.. 544 రోజుల కనిష్ఠానికి యాక్టివ్‌ కేసులు.!

భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ.. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమ్రికాన్‌ తీవ్ర కలవరం రేపుతోంది. ఇప్పటికే ఈ వెరియంట్‌కు సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఒమ్రికాన్‌ వేరియంట్‌ వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన అన్ని సూచనలను రాష్ట్రాలకు తెలిపింది. ఇదిలా ఉంటే తాజాగా దేశంలో కొత్తగా 8,309 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,80,832కు చేరుకుంది. 1,03,859 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 3,40,08,183 మంది కోలుకున్నారు. మహమ్మారి కరోనా వల్ల ఇప్పటి వరకు 4,68,790 మంది మరణించారు.

గత 24 గంటల్లో 9905 మంది కరోనా నుండి బయటపడ్డారు. 236 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 544 రోజుల కనిష్టానికి చేరాయి. కరోనా రికవరీ రేటు 98.34 శాతంగా ఉంది. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 4,350 కేసులు కేరళ రాష్ట్రంలోనే ఉన్నాయి. 159 మంది కరోనా కారణంగా కేరళలో మృతి చెందారు. దేశ వ్యాప్తంగా నిన్న 42 లక్షల మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఇప్పటి వరకు మొత్తంగా 122 కోట్ల వ్యాక్సిన్‌ పంపిణీ జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.


Next Story