దేశంలో తగ్గిన కరోనా కేసులు
India Corona Bulletin. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 16,64,360 శాంపిళ్లను పరీక్షించగా..
By Medi Samrat
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 16,64,360 శాంపిళ్లను పరీక్షించగా.. 42,640 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,99,77,861కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,167 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,89,302కి పెరిగింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) June 22, 2021
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/N3ddMzTI7u pic.twitter.com/IkST5O7oUW
నిన్న 81,839 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,89,26,038కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 6,62,521 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ రికవరీ రేటు 96.49 శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు ఐదు శాతానికి కన్నా తక్కువగా ఉందని మంత్రిత్వ శాఖ చెప్పింది. ప్రస్తుతం వ్లీకీ పాజిటివిటీ రేటు 3.21 శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 2.56 శాతం ఉందని.. వరుసగా 15 రోజుల్లో ఐదుశాతానికి కన్నా తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 28,87,66,201కి చేరింది.