భారత్ కరోనా బులిటెన్.. కొత్తగా ఎన్ని కేసులంటే..
India Corona Bulletin. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 13,88,699 శాంపిళ్లను పరీక్షించగా..
By Medi Samrat Published on 21 Jun 2021 10:37 AM ISTదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 13,88,699 శాంపిళ్లను పరీక్షించగా.. 53,256 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,99,35,221కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,422 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,88,135 కి పెరిగింది.
COVID-19 Testing Update. For more details visit: https://t.co/dI1pqvXAsZ @MoHFW_INDIA @DeptHealthRes @PIB_India @mygovindia @COVIDNewsByMIB #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 #Unite2FightCorona pic.twitter.com/9zhrEty6nY
— ICMR (@ICMRDELHI) June 21, 2021
నిన్న 78,190 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,88,44,199కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 7,02,887 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ రికవరీ రేటు 96.36 శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు ఐదు శాతానికి కన్నా తక్కువగా ఉందని మంత్రిత్వ శాఖ చెప్పింది. ప్రస్తుతం వ్లీకీ పాజిటివిటీ రేటు 3.32 శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 3.83 శాతం ఉందని.. వరుసగా 14 రోజుల్లో ఐదుశాతానికి కన్నా తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 28,00,36,898కి చేరింది.