కేరళలో రెండో మంకీఫాక్స్ కేసు
India confirms second case of monkeypox in Kerala's Kannur. దేశంలో కేరళలోని కన్నూర్ జిల్లాలో రెండో మంకీఫాక్స్ కేసు నిర్ధారణ అయింది.
By Medi Samrat
దేశంలో కేరళలోని కన్నూర్ జిల్లాలో రెండో మంకీఫాక్స్ కేసు నిర్ధారణ అయింది. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన కన్నూర్‌కు చెందిన 31 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు సోమవారం నిర్ధారణ అయింది. ప్రస్తుతం అతను ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నాడు. రోగి మే 13న కన్నూర్‌కు వచ్చాడు. తరువాత లక్షణాలు అభివృద్ధి చెందాయి. 31 ఏళ్ల రోగికి సంబంధించిన అందరూ సన్నిహితులు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నారు. జూలై 14న.. కొల్లం జిల్లాలో భారతదేశంలో మొట్టమొదటి మంకీఫాక్స్ కేసు నిర్ధారణ అయింది.
మొదటి కేసును గుర్తించినప్పుడు.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంకీపాక్స్ వ్యాధికి అడ్డుకట్ట వేయడానికి మార్గదర్శకాలను విడుదల చేసింది. మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం.. అంతర్జాతీయ ప్రయాణీకులు అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని నివారించాలని పేర్కొంది. చనిపోయిన లేదా జీవించి ఉన్న అడవి జంతువులు, ఇతరత్రా జీవులకు దూరంగా ఉండాలని పేర్కొంది.
WHO ప్రకారం.. సంవత్సరం ప్రారంభం నుండి 60 దేశాలలో 6,000 మంకీపాక్స్ కేసులు నమోదవగా.. మూడు మరణాలు నమోదయ్యాయి. నిఘా విస్తరిస్తున్న నేపథ్యంలో మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉందని పేర్కొంది. మంకీపాక్స్ అనేది వైరల్ జూనోసిస్ (జంతువుల నుండి మానవులకు సంక్రమించే వైరస్), ఇది గతంలో మశూచి రోగులలో కనిపించే లక్షణాలతో ఉంటుంది. అయితే ఇది వైద్యపరంగా తక్కువ తీవ్రతను కలిగి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది.