ఖమేనీ మృతిపై స్పందించిన భారత్‌

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ మృతిపై భారత్‌ తొలిసారి స్పందించింది.

By -  Medi Samrat
Published on : 5 March 2026 7:30 PM IST

ఖమేనీ మృతిపై స్పందించిన భారత్‌

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ మృతిపై భారత్‌ తొలిసారి స్పందించింది. ఖమేనీ మృతిపట్ల సంతాపం తెలిపింది. ఢిల్లీలోని ఇరాన్‌ ఎంబసీకి వెళ్లిన విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ సంతాప సందేశం రాశారు.

ఖమేనీ నివాసంపై ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు ఏకంగా 30 క్షిపణులను ప్రయోగించాయి. ఆయన ప్రాణాలు విడిచారు. శత్రు దుర్భేద్యమైన భద్రత కలిగిన అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించారు. ఖమేనీ కోసం కొన్ని నెలలపాటు కొనసాగిన వేట చివరకు రెండు గంటల ఐదు నిమిషాల ఆపరేషన్‌తో ముగిసిందని అమెరికా తెలిపింది. నిఘా వర్గాలు అందించిన పక్కా సమాచారంతోనే ఆయనను అంతం చేశారు.

Next Story