మానవ రహిత యుద్ధ విమానాన్ని పరీక్షించిన డీఆర్‌డీవో
India carries out maiden flight of unmanned combat aircraft. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) తొలిసారిగా
By Medi Samrat Published on 1 July 2022 8:39 PM ISTడిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) తొలిసారిగా మానవ రహిత యుద్ధ విమానాన్ని పరీక్షించింది. కర్ణాటకలోని చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ లో ఈ పరీక్ష చేపట్టారు. మానవ రహిత యుద్ధ విమానం అభివృద్ధిలో ఇది ఘనవిజయం అని డీఆర్డీవో వర్గాలు వెల్లడించాయి. ఈ మానవ రహిత యుద్ధ విమానానికి అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్ స్ట్రేటర్ గా నామకరణం చేశారు. మొట్టమొదటిసారిగా ఇవాళ నిర్వహించిన పరీక్షలో ఇది సాఫీగా టేకాఫ్ తీసుకుని, ఎలాంటి లోపాలు లేకుండా తిరిగి ల్యాండైంది.
#DRDOUpdates | Successful Maiden Flight of Autonomous Flying Wing Technology Demonstrator@PMOIndia https://t.co/K2bsCRXaYp https://t.co/brHxaH7wbF pic.twitter.com/SbMnI5tgUM
— DRDO (@DRDO_India) July 1, 2022
DRDO అధికారులు మాట్లాడుతూ, "మానవ రహిత యుద్ధ విమానాలను అభివృద్ధి చేయడంలో ఒక పెద్ద విజయం, అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్ కు చెందిన తొలి విమానం ఈరోజు కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుండి విజయవంతంగా నిర్వహించబడింది." అని తెలిపారు.
దీనిపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. అపూర్వమైన ఘనత సాధించారంటూ డీఆర్డీవో శాస్త్రవేత్తలను అభినందించారు. మానవరహిత వైమానిక వాహనం (UAV) DRDO ఆధ్వర్యంలోని ప్రధాన పరిశోధనా ప్రయోగశాల అయిన బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ADE)చే రూపొందించబడింది, అభివృద్ధి చేయబడింది. ఇది చిన్న టర్బోఫ్యాన్ ఇంజన్‌తో పనిచేస్తుంది. విమానం కోసం ఉపయోగించే ఎయిర్‌ఫ్రేమ్, అండర్ క్యారేజ్, మొత్తం ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్‌లు దేశీయంగా అభివృద్ధి చేయబడ్డాయి.