తమిళనాడులో బోణీ కొట్టనున్న బీజేపీ?

ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం తమిళనాడులో ఒకటి నుంచి మూడు లోక్‌సభ స్థానాలతో బీజేపీ గెలిచే చేసే అవకాశం ఉంది

By Medi Samrat  Published on  1 Jun 2024 7:27 PM IST
తమిళనాడులో బోణీ కొట్టనున్న బీజేపీ?

ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం తమిళనాడులో ఒకటి నుంచి మూడు లోక్‌సభ స్థానాలతో బీజేపీ గెలిచే చేసే అవకాశం ఉంది. అయితే 39 సీట్లలో ఇండియా కూటమి 33-37 స్థానాలను గెలుచుకోవచ్చని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.

2019 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ-ఎఐఎడిఎంకె నేతృత్వంలోని కూటమిని ప్రజలు తిరస్కరించారు. డిఎంకె నేతృత్వంలోని కూటమి 39 లోక్‌సభ నియోజకవర్గాల్లో 38 స్థానాల్లో విజయం సాధించింది. డీఎంకే నేతృత్వంలోని కూటమికి 50.9 శాతం ఓట్లు రాగా, గత ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 30.7 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. తమిళనాడు లోని కోయంబత్తూరు, శ్రీపెరంబుదూర్, రామనాథపురం, తూత్తుక్కుడి, సెంట్రల్ చెన్నై, చెన్నై సౌత్, నీలగిరిస్ లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మంచి పోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Next Story