గత 24 గంటల్లో 10వేలకు పైనే కరోనా కేసులు

India adds 10,753 fresh Covid cases. భారతదేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉంది. గత 24 గంటల్లో 10వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి

By Medi Samrat  Published on  15 April 2023 2:12 PM IST
గత 24 గంటల్లో 10వేలకు పైనే కరోనా కేసులు

India adds 10,753 fresh Covid cases

భారతదేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉంది. గత 24 గంటల్లో 10వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 1,58,625 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 10,753 కేసులు బయటపడ్డాయి. గత 24 గంటల వ్యవధిలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 53,720కి చేరింది. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి 4,43,22,211 మంది కోలుకున్నారు. భారతదేశంలో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,31,091కి చేరింది. నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.12శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.69 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. 220.66 కోట్ల (220,66,25,517) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.


Next Story