'ఇంటర్నెట్​ షట్​డౌన్' భారత్​లోనే అధికం.. కారణాలివే?

India accounts for most internet shutdown cases in the world in 2022. 'ఇంటర్​నెట్​ షట్​డౌన్' ఘటనలు ప్రపంచవ్యాప్తంగా పోల్చుకుంటే.. భారత్‌నే అధికం అని ఓ రిపోర్టులో బయటపడింది.

By అంజి  Published on  5 Aug 2022 4:27 AM GMT
ఇంటర్నెట్​ షట్​డౌన్ భారత్​లోనే అధికం.. కారణాలివే?

'ఇంటర్​నెట్​ షట్​డౌన్' ఘటనలు ప్రపంచవ్యాప్తంగా పోల్చుకుంటే.. భారత్‌నే అధికం అని ఓ రిపోర్టులో బయటపడింది. ఉద్రిక్త వాతావరణం, హింస చెలరేగిన ప్రాంతాల్లో ఇంటర్నెట్‌పై ఆయా ప్రభుత్వాలు నిషేధం విధిస్తాయి. పరిస్థితులు అదుపులోకి వచ్చేంతవరకు ఇంటర్నెట్‌పై ఆంక్షలు కొనసాగిస్తాయి. ఇలా భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లోని ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. అయితే.. ఇది భారత్‌లో కాస్త ఎక్కువ అని తేలింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఇంటర్నెట్‌పై ఎక్కువసార్లు నిషేధం విధించిన దేశాల్లో భారత్‌ మొదటి ప్లేస్‌లో ఉన్నట్టు నెట్‌బ్లాక్స్‌ అనే సంస్థ తన నివేదికలో తెలిపింది. ఈ లిస్ట్‌లో ఉన్న మొదటి 10 దేశాల్లో.. భారత్‌లోనే 85 శాతం ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌లు నమోదయ్యాయని పేర్కొంది.

సెన్సార్‌షిప్‌ ఎక్కువగా ఉన్న దేశాలు కూడా ఆసియాలోనే ఉన్నాయని నెట్‌బ్లాక్స్‌ తెలిపింది. భారత్‌లోని జమ్ముకశ్మీర్‌లో అధికంగా ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌ జరిగిందని, జూన్‌ 17న బీహార్‌లోని అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయని తెలిపింది. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌కు స్కీమ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలను అణచివేసేందుకు ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌ చేసిందని పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో చాలా చోట్ల మతపరమైన ఉద్రిక్తలు జరిగాయి. ఆయా సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను నిలిపివేశారు.

ఇదిలా ఉంటే.. 2021లోని తొలి ఆరు నెలలతో పోల్చుకుంటే.. ఈసారి జాబితాలోని తొలి 10 దేశాల్లో ఇంటర్​నెట్​పై షట్​డౌన్ ఘటనలు​ 14శాతం తగ్గాయి. అప్పుడు 84గా ఉండగా.. ఇప్పుడది 72కు చేరింది. అయితే.. ఇంటర్​నెట్​ షట్​డౌన్​ ఘటనలు తగ్గినా.. ప్రభావితమైన ప్రజల సంఖ్య మాత్రం పెరిగింది. గతేడాది 1.54 బిలియన్​ మంది ప్రజలు ఇబ్బంది పడితే.. ఈసారి ఆ సంఖ్య 1.89బిలియన్​కు చేరింది. సోషల్‌ మీడియాను సైతం ప్రభుత్వాలు నియంత్రిస్తున్నాయని నివేదిక పేర్కొంది.

Next Story