ఒకే రోజు మఠాన్ని, మసీదును, చర్చ్ ను సందర్శించిన రాహుల్ గాంధీ

In one day, Rahul Gandhi visits mutt, mosque, church. భారత్ జోడో యాత్ర 26వ రోజుకు చేరుకుంది. అయితే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఒకే రోజులోనే

By Medi Samrat  Published on  3 Oct 2022 2:00 PM GMT
ఒకే రోజు మఠాన్ని, మసీదును, చర్చ్ ను సందర్శించిన రాహుల్ గాంధీ

భారత్ జోడో యాత్ర 26వ రోజుకు చేరుకుంది. అయితే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఒకే రోజులోనే మఠం, మసీదు, చర్చిలను సందర్శించారు. మైసూర్‌లోని సుత్తూరు మఠాన్ని సందర్శించిన రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్రలో భాగంగా శ్రీ శివరాత్రి దేశికేంద్ర స్వామీజీని కలిశారు. ఆ తర్వాత మైసూర్‌లోని మస్జిద్-ఎ-ఆజామ్‌ను కూడా సందర్శించారు. అలాగే నగరంలోని సెయింట్ ఫిలోమినా చర్చిని కూడా సందర్శించారు.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం మధ్యాహ్నం మైసూరు చేరుకున్నారు. రెండు రోజుల విరామం తర్వాత యాత్ర తిరిగి ప్రారంభం కాగానే గురువారం ఉదయం ఆమె యాత్రలో పాల్గొంటారు. కూర్గ్‌లోని మడికేరిలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో సోనియా గాంధీ బస చేయనున్నారు.

'భారత్ జోడో' యాత్ర 25వ రోజున మైసూరులో కొనసాగింది. ఆదివారం సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. జోరున వర్షం కురుస్తున్నప్పటికీ ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. వర్షంలోనూ రాహుల్‌ ప్రసంగించారు. జోరు వర్షంలోనూ ప్రసంగాన్నికొనసాగించిన రాహుల్ అందుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ''భారత్‌ను ఏకం చేయడంలో మమ్మల్ని ఎవరూ ఆపలేరు. భారత గొంతుకను వినిపించడంలో ఎవరూ మమ్మల్ని నిలువరించలేరు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు జరిగే యాత్రను ఎవరూ ఆపలేరు'' అని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.


Next Story