వాళ్లకు డబ్బు ఇస్తే పని జరగదు.. కానీ మేం తీసుకుంటే తప్పకుండా పని చేస్తాం.. లంచాల‌ను స‌మ‌ర్థించుకున్న‌ పోలీస్

If police takes money, it gets the job done.. UP cop tells students. పోలీసులు లంచం తీసుకుంటున్నట్లు ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారి అంగీకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

By అంజి  Published on  20 Dec 2021 10:14 AM GMT
వాళ్లకు డబ్బు ఇస్తే పని జరగదు.. కానీ మేం తీసుకుంటే తప్పకుండా పని చేస్తాం.. లంచాల‌ను స‌మ‌ర్థించుకున్న‌ పోలీస్

దొంగచాటగా పోలీసులు లంచం తీసుకోవడం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఓ పోలిసు అధికారి లంచం తీసుకోవడాన్ని బహిరంగంగా సమర్ధించుకున్నాడు. పోలీసులు లంచం తీసుకుంటున్నట్లు ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారి అంగీకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థుల ముందు పోలీసు అధికారి ఈ మాటలు అన్నాడు. అయితే అక్కడే ఉన్న ఓ విలేఖరి.. పోలీసు అధికారి మాటలను రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పెట్టాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

'పోలీస్.. కీ పాఠశాల' కార్యక్రమం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో గల ఒక పాఠశాలలో విద్యార్థులతో పోలీసు అధికారి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు.. "పోలీసులు డబ్బు తీసుకుంటే పని పూర్తవుతుంది" అని పోలీసు చెప్పడం వినవచ్చు. ''పోలీసుల కంటే మంచి డిపార్ట్‌మెంట్ లేదు.. పోలీసులు డబ్బులు తీసుకుంటే ఆ పని కూడా అయిపోతుంది.. వేరే డిపార్ట్‌మెంట్‌కి వెళ్లండి.. డబ్బులు తీసుకుంటారు.. కానీ పని జరగదు.. టీచర్లను చూడండి.. ఇంట్లోనే ఉంటూ నేర్పిస్తారు. మేము కరోనావైరస్ మహమ్మారి ఇక్కడ ఉన్నప్పటికీ, సాధారణం కంటే ఎక్కువ పని చేస్తున్నాము." ఈ వీడియోను చూసిన ఉన్నావ్ జిల్లా పోలీసు అధికారులు.. "మొత్తం కేసును విచారించి నివేదికను పంపాలని జిల్లా మేజిస్ట్రేట్ బిఘపూర్‌ను ఆదేశించారు.


Next Story