ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలోని ఓ ఇంట్లో బ్యాగ్‌లో పేలుడు పదార్థాలను గుర్తించారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోదాలలో సీమాపురి ప్రాంతంలోని ఓ ఇంట్లోని బ్యాగ్‌లో పేలుడు పదార్థాలను గుర్తించారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందం సీమాపురిలోని ఇంటికి చేరుకుంది. సోదాలు చేయగా బ్యాగ్‌లో అనుమానాస్పద సీల్డ్ ప్యాక్ లభ్యమైంది. బ్యాగ్ దొరికిన గదిలో ముగ్గురు నుంచి నలుగురు అబ్బాయిలు అద్దెకు ఉంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు. అందులో ఉన్నవి ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)గా అధికారులు గుర్తించారు. ఘటనా స్థలానికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జి) బృందం చేరుకుంది.
గత నెలలో ఘాజీపూర్‌లో కనుగొనబడిన ఆర్‌డిఎక్స్ తో లింక్స్ ఉన్నాయనే కోణంలో ఈ సోదాలు జరిగాయి. అనుమానాస్పద వస్తువుకు సంబంధించి కాల్ వచ్చిందని.. ప్రత్యేక సెల్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఘాజీపూర్ ఐఈడీ కేసు దర్యాప్తులో భాగంగా ఓల్డ్ సీమాపురిలోని ఓ ఇంటి గురించి స్పెషల్ సెల్‌కు సమాచారం వచ్చింది. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ బృందం ఘటనా స్థలానికి చేరుకోగా ఆ ఇంటిని మూసివేసి ఉంచారు. ఆ తర్వాత సోదాలు నిర్వహించగా అనుమానాస్పద బ్యాగ్ కనిపించింది. అగ్నిమాపక శాఖ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) సంఘటనా స్థలానికి చేరుకున్నారు.