మాస్క్‌ తీసేదేలే.. అల్లు అర్జున్‌ 'పుష్ప' మీమ్‌.. వైరల్‌

I&B Ministry shares meme on Allu Arjun's 'Pushpa' to spread COVID-19 awareness. కోవిడ్‌-19 నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతోంది.

By అంజి  Published on  19 Jan 2022 7:56 PM IST
మాస్క్‌ తీసేదేలే.. అల్లు అర్జున్‌ పుష్ప మీమ్‌.. వైరల్‌

కోవిడ్‌-19 నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల విడుదలైన టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమా 'పుష్ప'లోని పాపులర్‌ డైలాగ్‌తో ఓ మీమ్‌ను క్రియేట్‌ చేసింది కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ. మీమ్ సందర్భానికి సరిపోయేలా పుష్ప చిత్రంలోని పాపులర్ డైలాగ్.. "పుష్ప, పుష్ప రాజ్... తగ్గెదేలే" కాస్తా మార్చి "డెల్టా అయినా ఓమిక్రాన్ అయినా.. మాస్క్‌ తీసేదేలే" అంటూ క్రియేట్‌ చేశారు. ఈ మీమ్‌ను కోవిడ్‌-19కి సంబంధించిన అప్‌డేట్‌లను పంచుకునే మంత్రిత్వ శాఖ యొక్క ట్విట్టర్ పేజీలు '#IndiaFightsCorona @COVIDNewsByMIB' పోస్టు చేశారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ డైలాగ్‌ చెప్పే స్టిల్‌లో ఫోటోషాప్ మాస్క్‌ ధరించినట్లు పెట్టారు. ఈ ప్రస్తుతం ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కోవిడ్‌-19కి వ్యతిరేకంగా దేశం యొక్క పోరాటం కొనసాగుతోందని, ప్రజలు తమ మాస్క్‌లను ధరించడం, చేతులను శుభ్రపరచడం, సామాజిక దూరాన్ని పాటించడం, పూర్తిగా టీకాలు వేసుకోవాలని ట్వీట్‌లో పేర్కొంది.


యాక్షన్ థ్రిల్లర్ రూపొందించిన పుష్ప సినిమా తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడతో సహా డబ్బింగ్ వెర్షన్‌లలో కూడా విడుదల చేయబడింది. సుకుమార్ రచన, దర్శకత్వం వహించిన "పుష్ప: ది రైజ్" సినిమాలో రష్మిక మందన్న, మలయాళ సినీ నటుడు ఫహద్ ఫాసిల్ కూడా నటించారు. బుధవారం నాడు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. దేశంలో ఒక రోజులో 2,82,970 కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి, భారతదేశం యొక్క మొత్తం COVID-19 కేసుల సంఖ్య 3,79,01,241కి చేరుకుంది, ఇందులో 8,961 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉన్నాయి.

Next Story