సహచర ఐఏఎస్ అధికారితో టీనా దాబీ నిశ్చితార్థం

IAS topper Tina Dabi to marry again. ఐఏఎస్ అధికారిణి టీనా దాబీ సోమవారం తన సహచర ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రదీప్ గవాండేతో

By Medi Samrat
Published on : 29 March 2022 1:32 PM IST

సహచర ఐఏఎస్ అధికారితో టీనా దాబీ నిశ్చితార్థం

ఐఏఎస్ అధికారిణి టీనా దాబీ సోమవారం తన సహచర ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రదీప్ గవాండేతో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించారు. టీనా 2016లో సివిల్ సర్వీస్ పరీక్షలో టాపర్‌గా నిలిచినప్పుడు తొలిసారిగా వార్త‌ల్లో నిలిచింది. 2013 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి ప్రదీప్ గవాండే ప్రస్తుతం రాజస్థాన్ ఆర్కియాలజీ & మ్యూజియమ్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇక‌ టీనా దాబీ, ప్రదీప్ గవాండేతో కలిసి ఉన్న ఫోటోను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు. "మీరు నాకు ఇచ్చిన చిరునవ్వును నేను ధరించాను.. #పియాన్సి అని ఫోటోకు క్యాప్షన్ జ‌త‌చేసింది.

ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రదీప్‌తో ఉన్న మరికొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది. టీనా, ప్రదీప్ ఇరువురు ఎరుపు రంగు దుస్తులు ధరించి ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ప్రదీప్ గవాండే కూడా టీనాతో ఉన్న ఫోటోను సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. టీనా, ప్రదీప్ జంట‌ ఏప్రిల్ 22న జైపూర్‌లో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే.. టీనా ఇన్‌స్టాగ్రామ్‌లో విశేష‌ ప్రజాదరణ పొందింది. ఆమె అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చురుకుగా ఉంటుంది. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఇంతకుముందు ఐఏఎస్ అధికారి అథర్ అమీర్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. అయితే వారు కొద్దికాలం క్రితం విడాకులు తీసుకున్నారు.









Next Story