గాలుల కారణంగా వంతెన ఎలా కూలిపోతుంది.?
IAS officer says Bihar bridge collapsed due to strong winds. బీహార్‌లోని సుల్తాన్‌గంజ్‌లో రోడ్డు వంతెన కూలిపోవడానికి గల కారణాలపై ఐఏఎస్ అధికారి స్పందించిన
By Medi Samrat
బీహార్‌లోని సుల్తాన్‌గంజ్‌లో రోడ్డు వంతెన కూలిపోవడానికి గల కారణాలపై ఐఏఎస్ అధికారి స్పందించిన తీరు పట్ల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అసంతృప్తి వ్యక్తం చేశారు. బీహార్‌లోని సుల్తాన్‌గంజ్ వద్ద గంగా నదిపై నిర్మాణంలో ఉన్న రహదారి వంతెన ఏప్రిల్ 29న పిడుగుపాటుకు కుప్పకూలింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. "ఏప్రిల్ 29న బీహార్‌లో వంతెన పడిపోయింది. దానికి కారణాలేమిటని నేను నా సెక్రటరీని అడిగాను. బలమైన గాలుల కారణంగా ఇది జరిగిందని ఆయన అన్నారని గడ్కరీ చెప్పారు.
ఒక ఐఏఎస్ అధికారి ఇలాంటి వివరణ ఇవ్వడం తనకు మింగుడుపడటం లేదని రోడ్డు రవాణా. రహదారుల శాఖ మంత్రి గడ్కరీ అన్నారు. "మేరే తో బాత్ సమాజ్ మే నహీ ఆ రహీ హై కి హవా ధుంధ్ సే కైసే బ్రిడ్జ్ గిరేగా? కుచ్ నా కుచ్ గలతీ హోగీ (బలమైన గాలుల కారణంగా వంతెన ఎలా కూలిపోతుందో నాకు అర్థం కాలేదు. ఏదో లోపం వంతెన కూలిపోవడానికి దారితీసిందని) గడ్కరీ అన్నారు.
నాణ్యత విషయంలో రాజీపడకుండా వంతెనల నిర్మాణ వ్యయాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని కూడా మంత్రి నొక్కి చెప్పారు. వంతెన కూలిన ఘటనపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దర్యాప్తునకు ఆదేశించారని సుల్తాన్‌గంజ్ ఎమ్మెల్యే లలిత్ నారాయణ్ మండల్ తెలిపారు. బ్రిడ్జి నిర్మాణంలో నాసిరకం మెటీరియల్స్ వాడే అవకాశాలను కొట్టిపారేయలేం. రూ.1,710 కోట్లతో నిర్మిస్తున్న, నిర్మాణంలో ఉన్న వంతెన బలమైన గాలులకు తట్టుకోలేక పోవడం విచారించాల్సిన అంశమని ఎమ్మెల్యే అన్నారు.
బీహార్‌లోని సుల్తాన్‌గంజ్, అగువానీ ఘాట్ మధ్య వంతెన నిర్మాణం 2014లో ప్రారంభమైంది. ఇది 2019లో పూర్తి కావాల్సి ఉంది కానీ దాని పని ఇంకా కొనసాగుతోంది. 3,116 మీటర్ల పొడవున్న వంతెన నిర్మాణం త్వరలోనే పూర్తవనుంది. ఇది దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ట్రాడోస్డ్ స్పాన్‌లను కలిగి ఉన్న వంతెనగా నిర్మితమవుతుంది.