భారత్‌ను ఎప్పటికీ తలదించుకోనివ్వను: ప్రధాని మోడీ
భారతదేశంపై ఉగ్రదాడి జరిగితే తక్షణమే దానికి కఠిన ప్రతిస్పందన ఉంటుందని ప్రధాని మోడీ మరోసారి వార్నింగ్ ఇచ్చారు
By Knakam Karthik
భారత్‌ను ఎప్పటికీ తలదించుకోనివ్వను: ప్రధాని మోడీ
భారతదేశంపై ఉగ్రదాడి జరిగితే తక్షణమే దానికి కఠిన ప్రతిస్పందన ఉంటుందని ప్రధాని మోడీ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా మన త్రివిధ దళాలు పాక్ ను మోకాళ్ల మీద నిలబెట్టాయని ప్రధాని నరేంద్ర మోడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ పట్ల దేశ ప్రజలంతా గర్వపడుతున్నదని ఇక పాకిస్తాన్ కుట్రలు నడవనన్నారు. ఇకపై ఉగ్రవాద దాడి జరిగితే భారత్ సమాధానం ఇలాగే ఉంటుందని, శత్రువుల న్యూక్లియర్ బాంబు దమ్కీలకు భయపడేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఇవాళ 18 రాష్ట్రాల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్ నుంచి వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన మోడీ.. పాక్ మన వైపు వచ్చినప్పుడల్లా భారత్ దే గెలుపు అని ఇది పాత భారత్ కాదని ఇది నయా భారత్ అన్నారు. శత్రువులను ఎలా మట్టుబెట్టాలో ఇప్పుడు మన సైన్యమే డిసైడ్ చేస్తుందని అందుకు మా ప్రభుత్వ త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని చెప్పారు. పాక్ కుట్రల్ని ప్రపంచమంతా తెలిపేందుకు మన ఎంపీలు బయల్దేరారన్నారు. పాక్ నిజస్వరూపాన్ని ప్రపంచానికి చూపిద్దామన్నారు. ఆపరేషన్ సిందూర్ న్యాయానికి కొత్త రూపం అని ఈ ఆపరేషన్ ఆక్రోశం కాదని సమర్థ భారత రౌద్ర రూపం అన్నారు. భారత్ ను ఎప్పటికి తలదించుకోనివ్వనని సంచలన వ్యాఖ్యలు చేశారు.