శశికళ తమిళనాడులోకి ఎప్పుడు అడుగుపెడతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూడగా.. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఆమె ఈరోజు తమిళనాడులో అడుగుపెట్టారు. కర్ణాటక సరిహద్దుల నుండి చెన్నై వరకూ ఆమెకు ఘన స్వాగతం పలికారు ఆమె మద్దతుదారులు. ఇక ఆమె ఏమి మాట్లాడుతారా అని ఎదురుచూడగా.. అన్నాడీఎంకే పార్టీ నాదేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను ప్రజా జీవితంలో ఉంటానని, క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. తాను ఎవరికీ భయపడనని అన్నారు. తనను వ్యతిరేకించిన వారికి తనేమిటో అర్థమయి ఉంటుందని చెప్పారు. అన్నాడీఎంకే పార్టీ నేతలు వణికిపోతున్నారని చెప్పారు. అన్నాడీఎంకే పార్టీ తనదేనని అన్నారు. అమ్మ వారసత్వాన్ని తాను కొనసాగిస్తానని చెప్పారు.
శశికళ వాహనంపై అన్నాడీఎంకే జెండా ఉండటం కూడా పెద్ద సంచలనమైంది. అన్నాడీఎంకే పార్టీలో చీలికలు రాబోతున్నాయంటూ ఇప్పటికే పలువురు ఊహించారు. అందుకు తగ్గట్టుగానే శశికళ వెంట పలువురు అన్నాడీఎంకే నేతలు ఉన్నారని చెబుతూ ఉన్నారు. నాలుగేళ్ల జైలు జీవితం తర్వాత తమిళగడ్డపై అడుగుపెట్టిన ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆమె చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో ప్రకంపనలు రేపుతూ ఉన్నాయి.