చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై సోనియా గాంధీ

I was waiting for long time Sonia Gandhi on Congress prez poll. కాంగ్రెస్ అధ్య‌క్ష‌ ఎన్నికల‌లో ఓటు వేయడానికి చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని

By Medi Samrat  Published on  17 Oct 2022 9:03 AM GMT
చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై సోనియా గాంధీ

కాంగ్రెస్ అధ్య‌క్ష‌ ఎన్నికల‌లో ఓటు వేయడానికి చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం అన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలోని బూత్‌లో ఓటు వేసిన అనంత‌రం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఈ రోజు కోసం నేను చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. సోనియా వెంట కూతురు, కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు. ఆమె కూడా త‌న‌ ఓటు వినియోగించుకున్నారు.

పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ ప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. సీనియ‌ర్ నాయ‌కులు మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్‌లు పోటీలో ఉన్నారు. ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో పి. చిదంబరం తొలి ఓటరు వేశారు. థరూర్ మార్పు కోసం పిలుపునిస్తూ.. తనకు ఓటు వేయాలని పార్టీ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.

ఇద్దరు పోటీదారులలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు దాదాపు 9,300 మంది కాంగ్రెస్ ప్రతినిధులు ఓటు వేయనున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో సాయంత్రం 4.00 గంటల వరకు ఓటింగ్ జరుగుతోంది. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ప్రకారం దాదాపు 67 బూత్‌లను ఏర్పాటు చేశారు. ఓటింగ్ ప్రక్రియ ముగియగానే బ్యాలెట్ బాక్సులన్నీ న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకువస్తారు. బుధవారం ఓట్ల లెక్కింపు ముగియగానే ఫలితాలు వెల్లడికానున్నాయి.


Next Story