ఉద్ధవ్ థాకరే.. కంగనా గురించి ఇలా అనేశారేంటి..!

I don't want to comment on Kangana Ranaut. శివసేన ప్రభుత్వానికి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు పెద్ద ఎత్తున మాటల యుద్ధం

By Medi Samrat  Published on  27 Nov 2020 8:28 AM GMT
ఉద్ధవ్ థాకరే.. కంగనా గురించి ఇలా అనేశారేంటి..!

శివసేన ప్రభుత్వానికి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు పెద్ద ఎత్తున మాటల యుద్ధం సాగుతోంది. ఆమె ఆఫీసును కూల్చివేయడం.. ముంబైలో అడుగుపెట్టాలంటే చాలా భయంగా ఉంది అంటూ కామెంట్లు చేయడంతో.. భారీ సెక్యూరిటీ నడుమ ఆమె రావడం చాలా ఘటనలే చోటు చేసుకున్నాయి. కంగనా శివ సేన నేతల మీద మొదటి నుండి పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ వెళుతోంది.

తాజాగా శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మాత్రం కంగనా రనౌత్ గురించి ఏమీ మాట్లాడనని చెప్పారు. అంతేకాదు.. ఆమె గురించి మాట్లాడేంత సమయం తనకు లేదని వ్యాఖ్యానించారు. శివసేన పత్రిక 'సామ్నా' కోసం ఉద్ధవ్ థాకరేను సంజయ్ రౌత్‌ ఇంటర్వ్యూ చేయగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కంగనాకు సంబంధించిన విషయాల గురించి వదిలేయాలని, ఆమె గురించి తాను మాట్లాడాలనుకోవడం లేదని అన్నారు. ముంబైపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అక్కడి పౌరులకు అవమానకరమని, దీనిపై కొందరు రాజకీయాలు చేయాలని భావిస్తున్నారని ఉద్ధవ్ స్పష్టం చేశారు.

కంగనా రనౌత్ చాలా రోజుల నుండి వార్తల్లో నిలిచే ఉంది. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఆమె వరుసగా పలువురు మీద ఆరోపణలు గుప్పిస్తూ వార్తల్లో నిలిచింది. ఆమె మీద పలు కేసులు కూడా నమోదయ్యాయి. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలీ చందేల్ పై కేసులు నమోదయ్యాయి. ఇప్పట్లో వీరిని అరెస్టు చేయకూడదని పోలీసులను ఆదేశించింది బాంబే హైకోర్టు. కానీ వీరిరువురూ జనవరి 8న ముంబై పోలీసుల ముందు హాజరు కావాలని ఆదేశించారు. సమన్లకు స్పందించకపోవడానికి కారణం.. మా ఇంట్లో జరుగుతున్న పెళ్లి అని కంగనా, చందేల్ లు కోర్టుకు తెలిపారు.


Next Story
Share it