హర్యానాలోని సోనిపట్‌లో పాక్ మద్దతుగల ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు సహకరిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితుల్లో భార్యాభర్తలు ఉన్నారు. ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు. అరెస్టయిన నిందితులను రవి, వరీందర్ దీప్ కౌర్, కనాభ్‌లుగా గుర్తించారు. రవి, వరీందర్ దీప్ కౌర్ భార్యాభర్తలు కాగా, కనాబ్ కూడా వీరికి సహకరిస్తూ ఉన్నాడు. నిందితులైన భార్యాభర్తలు పంజాబ్ కు చెందిన వారు కాగా, వారి మూడో వ్యక్తి జలంధర్‌కు చెందినవాడు.
భద్రతా సంస్థల ప్రకారం ముగ్గురు నిందితులు నకిలీ పాస్‌పోర్ట్‌లతో విదేశాలకు పారిపోవడానికి ఢిల్లీ విమానాశ్రయానికి వెళుతుండగా అరెస్టు చేశారు. సోనిపట్ లో ఈ ముగ్గురు జైషే మహ్మద్ సహాయకులు ప్రైవేట్ వాహనంలో వెళ్లిపోతున్నారని జమ్మూ కాశ్మీర్ పోలీసుల నుంచి సోనిపట్ పోలీసులకు సమాచారం అందింది. ముగ్గురు అనుమానితులను గుర్తించడానికి సోనిపట్ పోలీసులకు ఫోటోలు అందించబడ్డాయి. ఆ తర్వాత సోనిపట్ పోలీసులు పట్టుకోడానికి ప్రయత్నించి.. గనౌర్-ముర్తల్ మధ్య వారిని పట్టుకున్నారు.
ఆదివారం అర్థరాత్రి ఓ మహిళ, ఇద్దరు యువకులు కారులో నుంచి బయటకు రావడాన్ని గమనించిన పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. రవి, అతని భార్య వరిందర్ దీప్ కౌర్, ఆమె సహచరుడు కనాబ్‌లను తనిఖీ చేయగా, వారి వద్ద నుండి ఫతేహాబాద్‌లో తయారు చేసిన నకిలీ పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు.