కట్నకానుకలు తీసుకోనన్న పెళ్లి కొడుకు.. పెళ్లి కుమార్తె ఏమి చేసిందంటే..!
Husband refuses to take dowry. వరకట్నం తీసుకోవడం చట్టవిరుద్ధమని మనందరికీ తెలుసు, అయినప్పటికీ దేశంలోని
By Medi Samrat Published on 4 Dec 2021 12:22 PM GMTవరకట్నం తీసుకోవడం చట్టవిరుద్ధమని మనందరికీ తెలుసు, అయినప్పటికీ దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ ఆచారాన్ని బహిరంగంగా పాటిస్తున్నారు. కట్నం తీసుకోని పెళ్లికొడుకులు అతి తక్కువగా ఉన్నారు. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఓ విచిత్ర ఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వరకట్నం కింద వస్తున్న వస్తువులు తీసుకోనందుకు వధువు అత్తమామల ఇంటికి వెళ్లేందుకు నిరాకరించింది. ఈ కేసు భోపాల్‌లోని అరేరా కాలనీలో చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో నివసిస్తున్న జంట ఫిబ్రవరి 14, 2021న వివాహం చేసుకుంది.
పెళ్లిలో, అమ్మాయి తరపున వ్యక్తులు వరుడికి కారు మరియు అనేక విలువైన వస్తువులను ఇచ్చారు, కానీ అత్తారింటి వారు ఆ సామాను తీసుకెళ్లడానికి నిరాకరించారు. ఇది చూసిన అబ్బాయి భార్య కట్నకానుకలను అంగీకరించి ఇంటికి తీసుకురావాలని పట్టుబట్టింది. అప్పుడైతేనే అత్తారింటికి వస్తానని చెప్పి పుట్టినింట్లోనే ఉంది. దీంతో భార్యను ఇంటికి తీసుకురావాలని భర్త కోర్టును ఆశ్రయించాడు. కోర్టులో విచారణలో ఉన్న హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 9 కింద భర్త ఫిర్యాదు చేసినట్లు కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి.
తన ఇంట్లో సరుకులు పెట్టుకోవడానికి స్థలం లేదని, భార్యను కూడా ఒప్పించాలని భర్త కోర్టుకు తెలిపాడు. అంతేకానీ కట్నకానుకలు అంగీకరించడానికి సిద్ధంగా లేడు. అమ్మాయి మరియు ఆమె కుటుంబం అల్లుడికి తాము తమ ఆనందం కోసం వస్తువులను ఇస్తున్నాడు, ఇస్తున్నాము. ఒకే ఒక్క కుమార్తె ఉంది.. పెళ్లిలో అన్ని రకాల వస్తువులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఇప్పుడు భార్యాభర్తలిద్దరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు.