మాస్క్‌ల తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం
huge fire broke out at the Mask Manufacturing Center. ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు
By Medi Samrat Published on
26 Dec 2020 7:29 AM GMT

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని.. ఆరు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
మాయాపురి ప్రాంతంలోని ఓ మాస్క్‌ల తయారీ పరిశ్రమలో శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫ్యాక్టరీ తలుపులు బద్దలు కొట్టి మంటల్లో చిక్కుకున్న ముగ్గురిని బయటకు తీసుకొచ్చారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.
Next Story