మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో 65 ఏళ్ల వ్యక్తి చనిపోయాడనుకుని అంబులెన్స్ లో తీసుకుని వెళ్తున్నారు. స్పీడ్ బ్రేకర్ కారణంగా అంబులెన్స్ ఎగిరి కింద పడడంతో అతడి మళ్లీ ప్రాణం మళ్లీ తిరిగొచ్చింది. డిసెంబర్ 16న ఈ ఘటన వెలుగు చూసింది.
కసబా-బవాడ నివాసి పాండురంగ్ ఉల్పే గుండెపోటుతో బాధపడుతుండగా, వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అంత్యక్రియల నిమిత్తం ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఉల్పే మృతదేహాన్ని తీసుకెళ్తున్న అంబులెన్స్ స్పీడ్ బ్రేకర్ మీదుగా వెళ్ళాక ఎగిరిపడింది. ఆ తర్వాత అతని కుటుంబ సభ్యులు ఏదో అసాధారణమైన విషయాన్ని గమనించారు. క్షణాల్లో అతని వేళ్లు కదిలాయి. వెంటనే అంబులెన్స్‌ను మరో ఆసుపత్రికి మళ్లించారు.మరో ఆసుపత్రిలో అతడి గుండెకు యాంజియోప్లాస్టీ సర్జరీ చేశారు. రెండు వారాల చికిత్స అనంతరం అతను కోలుకొని ఇంటికి వచ్చాడు. ఉల్పే చనిపోయినట్లు మొదట ప్రకటించిన ఆసుపత్రి ఘటనకు సంబంధించి ఇంకా ప్రకటన విడుదల చేయలేదు.