పాపం మహిళా జవాన్.. పెళ్లి కోసం దాచుకున్న నగలన్నీ..!

జమ్మూ కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కి చెందిన ఒక మహిళా అధికారిణి తన బాధను వెళ్లగక్కింది.

By Medi Samrat
Published on : 5 Aug 2025 6:00 PM IST

పాపం మహిళా జవాన్.. పెళ్లి కోసం దాచుకున్న నగలన్నీ..!

జమ్మూ కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కి చెందిన ఒక మహిళా అధికారిణి తన బాధను వెళ్లగక్కింది. తాను దేశం కోసం ఆర్మీలో ఉంటున్నా, తమిళనాడులో తన కుటుంబం పరిస్థితి వేరేలా ఉందని వాపోయారు. తమ కుటుంబం దాఖలు చేసిన దొంగతనం కేసులో పోలీసులు నిష్క్రియాత్మకంగా వ్యవహరించారని ఆరోపిస్తూ, ఆమె కెమెరా ముందు విలపించారు.

సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడిన ఈ వీడియోలో, 32 ఏళ్ల కళావతి అనే అధికారి తన పెళ్లి కోసం పక్కన పెట్టిన నగలు దొంగిలించబడ్డాయని, స్థానిక పోలీసులు సకాలంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఏడుస్తూ వివరించారు. జూన్ 24న పొన్నై సమీపంలోని నారాయణపురం గ్రామంలోని తన ఇంట్లో దొంగతనం జరిగిందని కళావతి చెప్పారు. ఆ సమయంలో, ఆమె తండ్రి, సోదరుడు పొలంలో పనికి వెళ్లగా, ఆమె తల్లి పశువులు మేపడానికి వెళ్ళింది.

"తాళం పగలగొట్టి, నా పెళ్లి కోసం నేను దాచుకున్న ఆభరణాలన్నీ దోచేశారు. సాయంత్రం 5.30 గంటలకు నా తల్లి తిరిగి వచ్చేసరికి తాళం పగలగొట్టి, ఆభరణాలు దొంగిలించినట్లు తెలుసుకున్నాం. నా సోదరుడు తిరిగి వచ్చేసరికి నా తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఇది చూసి జూన్ 24న ఫిర్యాదు చేశాడు కానీ జూన్ 25న ముఖ్యమంత్రి భద్రతా విధుల్లో ఉన్నామని ఎవరూ దర్యాప్తుకు రాలేదు. తర్వాత వేలిముద్రలు సేకరించి జూన్ 28న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు" అని కళావతి వీడియోలో పేర్కొన్నారు. తన వివాహం కోసం దాచుకున్నవన్నీ కోల్పోయి కుటుంబం తీవ్ర నిరాశకు గురైందని, పోలీసులను సంప్రదించడానికి పదేపదే ప్రయత్నించినప్పటికీ, వారి వైపు నుండి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆమె వాపోయారు.

Next Story