పాకిస్థాన్‌కు చెందిన మహిళా నిఘా ఏజెంట్‌కు ఆకర్షితుడైన డీఆర్డీవో శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ భారతీయ మిస్సైల్ వ్యవస్థ రహ్యసాలను వెల్లడించినట్లు మహారాష్ట్రకు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు కురుల్కర్‌పై కేసు నమోదు చేశారు. పుణెలోని డీఆర్డీవో ల్యాబ్‌లో ప్రదీప్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. మే 3వ తేదీన ఆయన్ను దేశద్రోహం కేసు కింద అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. బ్రహ్మోస్ లాంచర్, డ్రోన్, యూసీవీ, అగ్ని మిస్సైల్ లాంచర్, మిలిటరీ బ్రిడ్జింగ్ సిస్టమ్‌తో పాటు ఇతర విషయాల గురించి పాక్ ఏజెంట్ సమాచారాన్ని రాబట్టినట్లు ఏటీఎస్ పోలీసులు చార్జ్‌షీట్‌లో వెల్లడించారు. పాక్ ఏజెంట్ వ్యామోహంలో పడిన అతను డీఆర్డీవోకు చెందిన రహస్య సమాచారాన్ని తన వ్యక్తిగత ఫోన్‌లో స్టోర్ చేసుకుని, దాన్ని జరాతో షేర్ చేసినట్లు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. వివిధ డిఫెన్స్ ప్రాజెక్టుల గురించి ఆమెతో చాట్ చేసినట్లు ప్రదీప్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఆ ఇద్దరూ జూన్ 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు కాంటాక్టులో ఉన్నట్లు ఏటీఎస్ పేర్కొన్నది.
ప్రదీప్‌పై అనుమానంతో అధికారులు అంతర్గతంగా విచారించడం మొదలు పెట్టగా.. వెంటనే అప్రమత్తమైన ప్రదీప్ జారా దాస్‌గుప్తా ఫోన్ నంబర్‌ని బ్లాక్ చేశాడు. ఆ తరవాత మరో వాట్సాప్ నంబర్ నుంచి ఆమె అతడిని సంప్రదించింది. ప్రదీప్ కేవలం DRDO సమాచారమే కాకుండా తన వ్యక్తిగత వివరాలనూ ఆమెతో షేర్ చేసుకున్నాడు. ఆమె వ్యామోహంలో పడిన అతను డీఆర్డీవోకు చెందిన రహస్య సమాచారాన్ని తన వ్యక్తిగత ఫోన్‌లో స్టోర్ చేసుకుని, దాన్ని ఆమెతో షేర్ చేసినట్లు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.