విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. కర్ణాటక హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Home Minister says survivor should not have been in desolate area. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగరంలో ఒక కళాశాల విద్యార్థినిపై సామూహిక

By Medi Samrat  Published on  26 Aug 2021 12:57 PM GMT
విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. కర్ణాటక హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగరంలో ఒక కళాశాల విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి జరిగింది. దుండగులు ఆ యువతి ప్రియుడిని కొట్టడంతో తీవ్రంగా గాయపడి చనిపోయాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరగ్గా బుధవారం సాయంత్రానికి కేసు నమోదైంది. నిందుతులు పరారీలో ఉన్నారు. నేరస్థులను పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీని రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మాయ్‌ ఆదేశించారు. మైసూర్‌ నగరంలోని ఒక విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థిని మంగళవారం రాత్రి 7.30 గంటలకు తన ప్రియుడితో కలిసి చాముండి హిల్స్‌ ప్రాంతం నుంచి తిరిగి వస్తున్నది. ఈ సమయంలో అటుగా వచ్చిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వారిని చుట్టుముట్టి తీవ్రంగా కొట్టి డబ్బులు లాక్కొన్నారు.

అనంతరం యువతిపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడే చనిపోయాడు. యువతి ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. మైసూరు పోలీసు కమిషనర్ డాక్టర్ చంద్రగుప్తా సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు దర్యాప్తు కోసం పలు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయ్ మాట్లాడుతూ నేరస్థులను పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీ ప్రవీణ్ సూద్‌ని ఆదేశించినట్లు చెప్పారు. ఇది చాలా దురదృష్టకర సంఘటన అని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి నేరస్థులను పట్టుకోవడానికి పోలీసు బృందాలు మైసూరు, బెంగళూరులో గాలిస్తున్నాయని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు.

సామూహిక లైంగిక దాడి ఘ‌ట‌న‌పై కర్ణాటక హోంమంత్రి అర‌గ జ్ణానేంద్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. లైంగిక దాడి ఘ‌ట‌న నేప‌థ్యంలో రాత్రి ఏడు గంట‌ల స‌మ‌యంలో అక్క‌డ ఆమె ఏం చేస్తోంద‌ని మంత్రి ప్ర‌శ్నించారు. విద్యార్థిని, ఆమె స్నేహితుడు అక్క‌డికి కాకుండా వేరే నిర్జ‌న ప్ర‌దేశానికి వెళ్లాల్సింద‌ని వ్యాఖ్యానించారు. సామూహిక లైంగిక దాడి ఘ‌ట‌న అమానుష‌న చ‌ర్య‌ని ఈ ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేసేందుకు కాంగ్రెస్ త‌మ‌పై బుర‌ద చ‌ల్లుతోంద‌ని మంత్రి ఆరోపించారు. మైసూర్‌లో లైంగిక దాడి ఘ‌ట‌న జ‌రిగితే కాంగ్రెస్ పార్టీ త‌న‌పై లైంగిక దాడికి ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆయ‌న విమర్శించారు. హోంమంత్రి వ్యాఖ్య‌లు బాధ్య‌తారాహిత్యమ‌ని విపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి.


Next Story
Share it