జహంగీర్‌పురిలో ఈద్‌ను కలిసి జరుపుకున్న హిందువులు, ముస్లింలు

Hindus, Muslims celebrate Eid together in Delhi's violence-hit Jahangirpuri. హిందూ, ముస్లిం సంఘాలు కలిసి మంగళవారం జహంగీర్‌పురిలో రంజాన్‌(ఈద్‌)ను జ‌రుపుకున్నారు.

By Medi Samrat  Published on  3 May 2022 3:30 PM GMT
జహంగీర్‌పురిలో ఈద్‌ను కలిసి జరుపుకున్న హిందువులు, ముస్లింలు

హిందూ, ముస్లిం సంఘాలు కలిసి మంగళవారం జహంగీర్‌పురిలో రంజాన్‌(ఈద్‌)ను జ‌రుపుకున్నారు. కుశాల్ చౌక్‌లో స్వీట్లు పంచుకుని కౌగిలింతలు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా ఈద్‌ను జరుపుకున్నారు. గత నెలలో మతపరమైన హింస చెల‌రేగిన ఈ ప్రాంతంలో ఇరు వ‌ర్గాలు క‌లిసి శాంతి, సామరస్య సందేశాన్ని ఇచ్చారు. అక్కడ మోహరించిన భద్రతా సిబ్బందికి కూడా స్థానికులు మిఠాయిలు పంచారు.

"గత నెల జహంగీర్‌పురి ప్రజలకు చాలా కష్టంగా ఉంది. ఈరోజు ఈద్ సందర్భంగా మేము కుశాల్ చౌక్‌లో సమావేశమయ్యాము. మేము మిఠాయిలు మార్చుకొని ఒకరినొకరు కౌగిలించుకొని, సామరస్యం, శాంతి సందేశాన్ని పంపాము. ఇది జహంగీర్‌పురిలోని ప్రజలు సామరస్యంతో జీవిస్తున్నారని చూపిస్తుంది. ఒకరి మతాలను ఒకరు గౌరవించుకోవాల‌ని ముస్లిం సమాజానికి చెందిన ప్రతినిధి తబ్రేజ్ ఖాన్ అన్నారు. త్వరలోనే ఈ ప్రాంతంలో పూర్తి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. "పరిస్థితి మెరుగుపడుతోంది. సాధారణ పరిస్థితులు చాలా వరకు తిరిగి వచ్చాయి. రాబోయే రోజుల్లో పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందని మేము ఆశిస్తున్నాము" అని ఆయన చెప్పారు.

ఈద్ సందర్భంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్‌వెస్ట్) ఉషా రంగాని మాట్లాడుతూ.. జిల్లా అంతటా తగిన భద్రత, చట్టబద్ధమైన ఏర్పాట్లు చేశాము. అన్ని ప్రాంతాలలో శాంతి, ప్రశాంతతను కాపాడేందుకు ఎప్పటిలాగే అమన్ కమిటీ సమావేశాలు నిర్వహించబడ్డాయి. కుశాల్ చౌక్ చుట్టుపక్కల ఉన్న దుకాణాలు, మసీదు ఉన్న C బ్లాక్‌లోని ప్రధాన లేన్ మినహా తిరిగి తెరవబడ్డాయి. దుకాణ‌దారులు కూడా వ్యాపారం కోసం తిరిగి వచ్చారు.

హిందూ సమాజానికి ప్రాతినిధ్యం వహించిన రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఇంద్రమణి తివారీ మాట్లాడుతూ ఈద్‌ను శాంతియుతంగా జరుపుకుంటున్నామన్నారు. "మేము కలిసి ఈద్ జరుపుకుంటున్నాము. ప్రజల మధ్య ఈ సామరస్యం ఉండాలని ఆశిస్తున్నాము. ఈ ప్రాంతంలో శాంతి ఉంది. త్వరలో పూర్తి సాధారణ స్థితికి వస్తుందని మేము ఆశిస్తున్నాము" అని తివారీ చెప్పారు.

జహంగీర్‌పురిలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇందులో ఎనిమిది మంది పోలీసులు, స్థానిక నివాసి గాయపడ్డారు. హింస జరిగిన ఒక వారం తర్వాత.. హిందువులు, ముస్లింలు కలిసి జహంగీర్‌పురి సి బ్లాక్‌లో 'తిరంగా యాత్ర' చేపట్టారు.



















Next Story