ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
Hindu shopkeeper beheaded in Udaipur over social media post on Nupur Sharma. ఉదయ్‌పూర్‌లో మంగళవారం పట్టపగలు ఓ దుకాణదారుడు హత్యకు గురైన సంఘటన
By Medi Samrat Published on 28 Jun 2022 2:37 PM GMT
ఉదయ్‌పూర్‌లో మంగళవారం పట్టపగలు ఓ దుకాణదారుడు హత్యకు గురైన సంఘటన నగరంలో ఉద్రిక్తతకు దారితీసింది. కన్హయ్య లాల్ అనే దుకాణదారుని ఇద్దరు వ్యక్తులు తల నరికి చంపారు. తరువాత నుపుర్ శర్మకు మద్దతుగా ఉన్న వ్యక్తిని చంపినట్లు అంగీకరించిన వీడియోను సోషల్ మీడియా పోస్ట్ ద్వారా రికార్డ్ చేశారు. సమాచారం మేరకు ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నూపూర్ శర్మకు మద్దతుగా దుకాణదారుడి ఎనిమిదేళ్ల కుమారుడు పెట్టిన పోస్ట్‌ను అనుసరించి హత్య జరిగినట్లు తెలుస్తోంది. నూపుర్ శర్మ ఇటీవల ప్రవక్త ముహమ్మద్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. మంగళవారం ఉదయపూర్‌లోని ఓ టైలర్ షాపులోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించి కత్తులతో దాడికి దిగుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఇద్దరు వ్యక్తులు పోస్ట్ చేసిన ప్రత్యేక వీడియోలో, ఇద్దరూ హత్య చేసినట్లు అంగీకరించడం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బెదిరించడం రికార్డైంది. ఘటనతో ఉదయ్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాల్డాస్ స్ట్రీట్ ప్రాంతంలోని దుకాణాలన్నీ మూసేశారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. 600 మంది పోలీసులను ఆ ప్రాంతానికి తరలించారు.
ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్తతలు తలెత్తడంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వెంటనే స్పందించారు. ఉదయ్‌కుమార్‌లో ఒక యువకుని అత్యంత పాశవికంగా హత్య చేయడాన్ని తాము ఖండిస్తున్నామని అన్నారు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, వీడియోను ఎవరికీ షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు.