Viral Video : జూనియర్‌ను బెల్ట్‌తో బాదేశారు..!

హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో సీనియర్ విద్యార్థుల బృందం ఒక జూనియర్ విద్యార్థిని దుర్భాషలాడడం, కొట్టడం, బెల్ట్ తో బాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది

By Medi Samrat  Published on  11 Sept 2024 9:00 PM IST
Viral Video : జూనియర్‌ను బెల్ట్‌తో బాదేశారు..!

హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో సీనియర్ విద్యార్థుల బృందం ఒక జూనియర్ విద్యార్థిని దుర్భాషలాడడం, కొట్టడం, బెల్ట్ తో బాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. కందఘాట్‌లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక జూనియర్ విద్యార్థిని చుట్టుముట్టిన విద్యార్థుల గుంపు అతడిని హింసించడం వీడియోలో రికార్డు అయింది. జూనియర్ విద్యార్థి మద్యం తాగేందుకు నిరాకరించడంతో ఈ టార్చర్ అనుభవించాల్సి వచ్చింది.

ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు తనపై దాడికి పాల్పడ్డారని చాలా రోజులుగా వేధిస్తున్నారని బాధిత విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీనియర్ల దాడిలో విద్యార్థి గాయపడ్డాడు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యూనివర్శిటీకి చెందిన యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమైంది. విచారణ తర్వాత విద్యార్థుల భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోనున్నారు.

Next Story