హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. జీతాలకు కూడా డబ్బులు లేకపోవడంతో.. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని రాష్ట్ర మంత్రులు, ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శులు (సీపీఎస్), క్యాబినెట్ స్థాయి సభ్యులందరూ రెండు నెలల పాటు జీతాలు తీసుకోరని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు రాష్ట్ర అసెంబ్లీకి తెలిపారు. రాష్ట్రం బాగుపడేంత వరకు రెండు నెలల పాటు జీతాలు, టీఏ, డీఏలు తీసుకోబోమని కేబినెట్‌లోని సభ్యులందరూ నిర్ణయించారని ముఖ్యమంత్రి తెలిపారు. అంతకు ముందు కేబినెట్ భేటీలో దీనిపై చర్చించారు.
అయితే ముఖ్యమంత్రి ప్రకటనపై మాజీ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ నేతృత్వంలోని ప్రతిపక్ష బీజేపీ అసెంబ్లీ నుండి వాకౌట్ చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శులను (సీపీఎస్) సృష్టించింది, చాలా మందికి కేబినెట్, చైర్మన్ హోదా ఇచ్చారని జైరాం ఠాకూర్ తెలిపారు. జీతాలను వాయిదా వేయడం ఖచ్చితంగా అన్ని సమస్యలకు పరిష్కారం కాదని నేను నమ్ముతున్నానని అన్నారు. ముందు విషయం ఏమిటో తెలుసుకుంటాను.. ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత దాని గురించి మాట్లాడుతామని జైరాం ఠాకూర్ తెలిపారు.