దేశంలో అత్యధిక కరోనాకేసులు ఎక్కడంటే..

Highest Corona Cases In India. మహారాష్ట్రని కరోనా మహమ్మారి గజగజ లాడిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా

By Medi Samrat  Published on  26 March 2021 4:31 AM GMT
Highest Corona Cases In India

మహారాష్ట్రని కరోనా మహమ్మారి గజగజ లాడిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత రికార్డులు బద్దలవుతున్నాయి. తాజాగా, గురువారం ఒక్కరోజే దాదాపు 36వేల కొత్త కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలోకి కరోనా ప్రవేశించిన తర్వాత మహారాష్ట్రలో ఇవే అత్యధిక కేసులు కావడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 35,952 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా మరో 111 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 53,795కు చేరుకుంది.

ప్రస్తుతానికి రాష్ట్రలో ప్రస్తుతం 2,62,685 యాక్టివ్ కేసులు ఉన్నట్టు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గురువారం 20,444 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది.కేవలం నాలుగు రోజుల్లోనే లక్ష కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా మొదలైన నాటి నుంచి ఈ స్థాయిలో కరోనా కేసులు ఇంకెక్కడా పెరగలేదు.

ఇక ముంబై నగరంలో కరోనా వైరస్ మరోసారి అలజడి రేపుతోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ రికార్డు స్థాయిలో 5505 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 14 మంది మరణించారు. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరున్న ధారావిలో కరోనా మరోసారి పంజా విసురుతోంది. ప్రస్తుతం ముంబైలో అత్యధికంగా 32,529 యాక్టివ్‌ కేసులున్నాయి. దేశంలో నిత్యం నమోదవుతున్న కరోనా కేసుల్లో 60 శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే బయటపడుతున్నాయి. దీనికి తోడు కొత్త మ్యుటేషన్ల వ్యాప్తికి సంబంధించిన ఆందోళన నెలకొంది. రాబోయే రోజుల్లో వైరస్‌ వ్యాప్తి మరింత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అంతే కాదు ప్రస్తుతం కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి పట్టే సమయం 75 రోజులకు తగ్డడం కూడా ఆందోళనకర విషయమని అధికారులు చెబుతున్నారు.

ఇక దేశంలో రోజు నమోదవుతున్న మొత్తం కేసుల్లో 60 శాతం కంటే ఎక్కువ ఒక్క మహారాష్ట్రలోనే బయటపడుతుండటం గమనార్హం.



Next Story