హై అలర్ట్.. ఆ రాష్ట్రంలో..

High Alert In Punjab. పాక్ ఐఎస్ఐ మద్దతు ఉన్న ఉగ్రవాదులను అరెస్టు చేశారు పంజాబ్ పోలీసులు.

By Medi Samrat  Published on  16 Sep 2021 7:31 AM GMT
హై అలర్ట్.. ఆ రాష్ట్రంలో..

పాక్ ఐఎస్ఐ మద్దతు ఉన్న ఉగ్రవాదులను అరెస్టు చేశారు పంజాబ్ పోలీసులు. దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించింది కేంద్ర హోం శాఖ. నవరాత్రి, రామ్‌లీలా ఉత్సవాలే టార్గెట్‌ చేస్తూ.. ముష్కరమూకలు భారీ విధ్వంసానికి ప్లాన్ చేశారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రకుట్రను భగ్నం చేశాయి. ఇద్దరు తీవ్రవాదులతో సహా ఆరుగురిని దేశ రాజధాని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు ఏ రూపంలోనైనా దాడి చేసే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని భద్రతా దళాలను హెచ్చరించారు. స్థానికంగా ఎలాంటి అనుమానితులు కనిపించిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.

పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ జిల్లాలో గత నెలలో జరిగిన పేలుడులో పాల్గొన్న పాక్ ఐఎస్ఐ మద్దతు ఉన్న నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసిన తర్వాత రాష్ట్రంలో పోలీసుబలగాలను సీఎం అప్రమత్తం చేశారు. గత 40 రోజుల్లో పాక్ టెర్రర్ మాడ్యూల్ ను ఛేదించిన నాల్గవ కేసు. పంజాబ్ రాష్ట్రంలో ఉగ్రవాదులు శాంతిభద్రతలకు భంగం కలిగించేలా చేస్తున్న ప్రయత్నాలను గమనించిన సీఎం అమరీందర్ సింగ్ హైఅలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలోని మార్కెట్లలో భద్రతను పెంచాలని సీఎం డీజీపీని ఆదేశించారు.


Next Story
Share it