తన మొబైల్ వాడకం ఎలా ఉంటుందో చెప్పిన ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చా కొత్త ఎడిషన్ లో కీలక వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on  29 Jan 2024 3:40 PM GMT
తన మొబైల్ వాడకం ఎలా ఉంటుందో చెప్పిన ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చా కొత్త ఎడిషన్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 29న న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జరిగింది. ఈ ప్రోగ్రామ్ 7వ ఎడిషన్‌లో మొత్తం 205.62 లక్షల మంది విద్యార్థులు, 14.93 లక్షల మంది ఉపాధ్యాయులు, 5.69 లక్షల మంది తల్లిదండ్రులు భాగమయ్యారు. ఈ ఎడిషన్‌లో, సాంకేతికతను ఎలా ఉపయోగించాలి, దాని ప్రయోజనాలను ఎలా ఉపయోగించుకోవాలి, దానిని తెలివిగా ఉపయోగించడం ఎందుకు ముఖ్యమో ప్రధాని చర్చించారు.

మొబైల్ వినియోగం గురించి ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైనా అతిగా వినియోగిస్తే మంచిది కాదని.. కాబట్టి విద్యార్థులు ఎప్పుడూ మొబైల్ వెంట పడకూడదని ప్రధాని మోదీ సూచించారు. ఇక అవసరం ఉంటేనే తాను మొబైల్‌ను వినియోగిస్తానన్నారు. విద్యార్థులు కూడా మొబైల్ ఫోన్లలో స్క్రీన్ టైమ్ అలర్ట్ టూల్స్‌ను ఉపయోగించాలన్నారు. సమయాన్ని గౌరవించాలని, మొబైల్స్ చూస్తూ సమయాన్ని మరిచిపోవద్దని తెలిపారు. పిల్లల ఫోన్ల పాస్ వర్డ్‌ను తల్లిదండ్రులు తప్పకుండా తెలుసుకోవాలని మోదీ సూచించారు.

Next Story