బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు.. అధికారంలో ఉన్న రాష్ట్రాల లిస్ట్‌ ఇదే

నిన్నటి కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత.. బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. అది అధికారంలో ఉన్న రాష్ట్రాల జాబితా

By అంజి  Published on  14 May 2023 10:28 AM IST
states, BJP, Congress, nationalnews

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు.. అధికారంలో ఉన్న రాష్ట్రాల లిస్ట్‌ ఇదే 

నిన్నటి కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత.. బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. అది అధికారంలో ఉన్న రాష్ట్రాల జాబితా నుండి మరో రాష్ట్రాన్ని కోల్పోయింది. ప్రస్తుతం భారతదేశంలోని 28 రాష్ట్రాలలో 10 రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉంది. దీనికి తోడు మరో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ కూటమి అధికారంలో ఉంది. బీజేపీ లేదా దాని కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాల జాబితా క్రింద ఉంది.

1. అరుణాచల్ ప్రదేశ్

2. అస్సాం

3. గోవా

4. గుజరాత్

5. హర్యానా

6. మధ్యప్రదేశ్

7. మహారాష్ట్ర

8. మణిపూర్

9. మేఘాలయ

10. నాగాలాండ్

11. సిక్కిం

12. త్రిపుర

13. ఉత్తర ప్రదేశ్

14. ఉత్తరాఖండ్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం

కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడం.. ఫలితాలకు ముందే స్పష్టంగా కనిపించింది. ఇక అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం అనిపించింది. కర్ణాటకలో కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకోగా, బీజేపీ, జేడీ(ఎస్) వరుసగా 66, 19 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఓటమి నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారం తన రాజీనామాను సమర్పించారు. ఈ ఓటమి దక్షిణ భారతదేశంలోని బీజేపీ రాజకీయ పట్టును ప్రభావితం చేసింది.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల జాబితా

మిగిలిన 14 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా, మూడు రాష్ట్రాల్లో ఐఎన్‌సీ కూటమి అధికారంలో ఉంది.

కాంగ్రెస్ లేదా దాని కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాల జాబితా ఇదే

1. బీహార్

2. ఛత్తీస్‌గఢ్

3. హిమాచల్ ప్రదేశ్

4. జార్ఖండ్

5. కర్ణాటక

6. రాజస్థాన్

7. తమిళనాడు

ఆరు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ కాకుండా జాతీయ పార్టీలు పాలిస్తున్న ఏకైక రాష్ట్రం పంజాబ్. ఇది ఇటీవల జాతీయ పార్టీ హోదాను పొందిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)చే పాలించబడుతుంది. శాసన సభలు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలలో ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉండగా, పుదుచ్చేరిలో బీజేపీ కూటమి అధికారంలో ఉంది. అయితే, శాసనసభతో కూడిన మూడో కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉంది.

Next Story