సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన‌ హేమంత్‌ సోరెన్

హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. జార్ఖండ్‌ 13వ ముఖ్యమంత్రిగా జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆహ్వానించడంతో గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు.

By Medi Samrat  Published on  4 July 2024 1:45 PM GMT
సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన‌ హేమంత్‌ సోరెన్

హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. జార్ఖండ్‌ 13వ ముఖ్యమంత్రిగా జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆహ్వానించడంతో గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. భూ కుంభకోణం కేసులో దాదాపు ఐదు నెలల జైలు జీవితం గడిపిన తర్వాత హేమంత్ సోరెన్ ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. రాంచీలోని రాజ్ భవన్‌లో సీపీ రాధాకృష్ణన్ చేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయించారు.

సోరెన్ తండ్రి, జేఎంఎం అధినేత శిబు సోరెన్, ఆయన తల్లి రూపి సోరెన్, భార్య కల్పనా సోరెన్, జేఎంఎం నేతృత్వంలోని కూటమి సీనియర్ నేతలు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో హేమంత్ సోరెన్ జూన్ 28న జైలు నుంచి విడుదలయ్యారు. బుధవారం రాష్ట్రంలో జేఎంఎం నేతృత్వంలోని కూటమి ఆయనను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

జనవరి 31న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన కొద్దిసేపటికే హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

Next Story