బలపరీక్షకు హేమంత్ వెళ్ల‌వచ్చు..!

మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టయ్యి, ఈడీ కస్టడీలో ఉన్న జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఆ రాష్ట్ర అసెంబ్లీలో త్వరలో జరగబోయే బలపరీక్షలో పాల్గొనవచ్చట

By Medi Samrat  Published on  3 Feb 2024 7:52 PM IST
బలపరీక్షకు హేమంత్ వెళ్ల‌వచ్చు..!

మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టయ్యి, ఈడీ కస్టడీలో ఉన్న జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఆ రాష్ట్ర అసెంబ్లీలో త్వరలో జరగబోయే బలపరీక్షలో పాల్గొనవచ్చట. బలపరీక్షలో సోరెన్‌ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు జార్ఖండ్‌ రాజధాని రాంచిలోని PMLA కోర్టు అనుమతించింది.

జార్ఖండ్‌ అసెంబ్లీలో వచ్చే ఫిబ్రవరి 5న బలపరీక్ష జరగనుంది. సీఎం చంపాయ్‌ సోరెన్‌ సభలో తన బలాన్ని నిరూపించుకోనున్నారు. భూ కుంభకోణంలో అరెస్టయిన జార్ఖండ్ ముక్తి మోర్చా నేత హేమంత్ సోరెన్‌కు ఫిబ్రవరి 5, 6 తేదీల్లో రాష్ట్ర అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్షలో పాల్గొనేందుకు అనుమతి లభించింది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విశ్వాస పరీక్షలో పాల్గొనేందుకు రాంచీలోని ప్రత్యేక కోర్టు శనివారం అనుమతించింది. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన హేమంత్ సోరెన్, కొత్త చంపాయ్ సోరెన్ ప్రభుత్వం కోరిన విశ్వాస పరీక్షలో పాల్గొనేందుకు అనుమతి కోరుతూ ప్రత్యేక PMLA (మనీలాండరింగ్ నిరోధక చట్టం) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

చంపై సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం 41 మెజారిటీ మార్కును చేరుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం 43 మంది ఎమ్మెల్యేలు తమకు మద్దతుగా ఉన్నారని జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ భావిస్తోంది. ఇక జార్ఖండ్ రాజకీయం శుక్రవారం హైదరాబాద్‌కు మారింది, అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) నేతృత్వంలోని కూటమికి చెందిన దాదాపు 40 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించారు.

Next Story