ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

Heavy rains lash Delhi-NCR through the night. శుక్రవారం, శనివారం మధ్య రాత్రి సమయంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో భారీ వర్షంతో ఉరుములతో కూడిన వర్షం కురిసింది.

By అంజి  Published on  8 Jan 2022 9:10 AM IST
ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

శుక్రవారం, శనివారం మధ్య రాత్రి సమయంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో భారీ వర్షంతో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ పూర్తిగా నీట మునిగాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాణక్యపురి, తూర్పు ఢిల్లీ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఇవాళ ఉదయం వరకు కురిసింది.

మరికొద్ది సేపటికి వర్షం తగ్గదని సూచిస్తూ, ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం, పరిసర ప్రాంతాలలో ఒక మోస్తరు నుండి భారీ తీవ్రతతో కూడిన ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ తెల్లవారుజామున 4.55 గంటలకు ట్వీట్ చేసింది. "ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, మనేసర్, బల్లభ్‌గఢ్, కర్నాల్, పానిపట్, మట్టన్‌హైల్, ఝజ్జర్, ఫరూఖ్‌నగర్, కోసలి, రేవారీ, బవాల్, నూహ్ (హర్యానా) పరిసర ప్రాంతాలలో ఒక మోస్తరు నుండి భారీ తీవ్రతతో కూడిన వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.



Next Story