రేపు స్కూళ్ల‌కు సెల‌వు

Heavy rains hit region; Chief Minister announces holiday for schools tomorrow. ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సీఎం కేజ్రీవాల్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

By Medi Samrat  Published on  9 July 2023 8:58 PM IST
రేపు స్కూళ్ల‌కు సెల‌వు

ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సీఎం కేజ్రీవాల్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఢిల్లీలోని అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు. భారీ వర్షాల కారణంగా కేజ్రీవాల్ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని రేపు ఢిల్లీలోని అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. శనివారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలు.. ఢిల్లీలో 41 ఏళ్ల రికార్డుల‌కు చేరువ‌యిన‌ట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం 8:30 గంటల వరకు 153 మి.మీ వర్షపాతం నమోదైంది. 1982లో 169.9 మి.మీ వర్షం కురిసింది.


Next Story